- Local News, News, Political

వైసీపీ గెలుపుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

గుంటూరు: వైసీపీ గెలుపుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలమో లేదా ఈవీఎంల ఘనతతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ సర్కారు ఇసుకతో ఆడుకుంటోందని, ఇది ప్రమాదకరమని పవన్‌ హెచ్చరించారు. కౌలు కోసం రాజధాని రైతులు భూములివ్వలేదని, ప్రజలను కన్నీరు పెట్టిస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని ఇక్కడ వద్దంటున్నారంటే… ప్రధాని మోదీని, అమిత్‌షాను వ్యతిరేకిస్తున్నట్టేని చెప్పారు. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులను బొత్స గుర్తించుకోవాలని, రాజధానికి అన్యాయం జరిగితే మోదీ, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాజధానిని మార్చాలని చూస్తే పోరాటం ఉధృతం చేస్తామని, రాజధానిలో రైతులు భూములను అమ్ముకోవద్దని పవన్‌ సూచించారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసంపైనే దృష్టి సారిస్తోంది. ప్రజల ఆస్తులను ఇష్టానుసారంగా వాడుకుంటామంటే ఊరుకోం. రాజధానికి రాజకీయ, కుల రంగులు పులమడం సరికాదు. అసైన్డ్‌ భూముల రైతులకు టీడీపీ హయాంలో న్యాయం జరగలేదు. ఎల్‌అండ్‌టీ సైట్‌లో ఏడువేలమంది కార్మికులు పనిచేశారు. ఆ ప్రాంతం కిటకిటలాడిపోయేది, ఇప్పుడు వారంతా సర్దుకుపోతున్నారు. ఇలాంటి పరిణామాలతో ఎవరికి నష్టం, రాష్ట్రం దెబ్బతింటుంది’’ అని పవన్‌ హెచ్చరించారు…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *