- Local News, National International, News, Political

370 అధికరణ రద్దు నేపథ్యంలో”జాతీయ ఐక్యతా” ప్రచారానికి బీజేపీ సిద్ధం

చెన్నై: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు నేపథ్యంలో ‘జాతీయ ఐక్యతా’ ప్రచారానికి బీజేపీ సిద్ధమవుతోంది. ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ పేరుతో ఈ జాతీయ ఐక్యతా ప్రచారాన్ని సెప్టెంబర్ 1 నుంచి బీజేపీ ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు తెలిపారు.
శనివారంనాడిక్కడ మీడియాతో మురళీధర్ రావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ నినాదంతో బీజేపీ జాతీయ ఐక్యతా ప్రచారం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. నెల రోజుల పాటు జరిగే ఈ ప్రచారంలో నేరుగా ప్రజల్లోకి వెళ్లి 370 అధికరణ రద్దుకు ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో వివరించి చెబుతామని అన్నారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిచేందుకు ఆలోచన చేస్తున్నామని, ఆ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల జోనల్ స్థాయి వర్క్‌షాప్ ఇవాళ చెన్నైలో నిర్వహిస్తున్నామని, ఇందులో ఆయా కార్యక్రమాల గురించిన చర్చ ఉంటుందని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ప్రాంతాల సీఎంలు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ‘జాతీయ ఐక్యతా’ ప్రచారంలో పాల్గొంటారని మురళీధర్ రావు తెలిపారు…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *