- Local News, News, Political

సముద్రపు ఇసుక అక్రమ రవాణా

ట్రాక్టర్లోకి ఎత్తుతున్న సముద్రపు ఇసుక

జైసూర్యన్యూస్, విశాఖ,కడపాలెం,అచ్యుతాపురం: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక లభించకపోవడంతో ప్రజలు సముద్రపు ఇసుకను సైతం వినియోగించాల్సిన పరిస్థితి ఎదురైంది. అవసరాలను గుర్తించిన ఇసుక వ్యాపారులు సముద్రపు ఇసుకను రహస్యంగా రవాణా చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు. పూడిమడక శివారు కడపాలెం నుంచి పగలే దర్జాగా సముద్రపు ఇసుకను రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లను నేరుగా సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లకుండా డ్రైఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ వద్ద ఇసుకను ముందుగా నిల్వచేసి అక్కడ నుంచి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు రహస్యంగా రవాణా చేస్తున్నారు. అత్యవసర నిర్మాణాలకు ఇసుక లభించకపోవడంతో ప్రజలు ఏదో ఒక ఇసుక దొరుకుతుందిలే అనే ఆలోచనతో దీన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ ఇసుక సమీపంలో ఉండే సెజ్‌కి రవాణా చేస్తున్నారు. సముద్రపు ఇసుకతో నిర్మించిన భవనాలు, గోడలు తక్కువ కాలంలోనే శిథిలమై కూలిపోయే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సెజ్‌ కంపెనీల నిర్మాణానికి సరిపడే ఇసుక లభించకపోవడంతో గుత్తేదారులు సముద్రపు ఇసుకనే వాడుకుంటున్నారు.

చుక్కలనంటుతున్న ఇసుక ధర

ఎలమంచిలి,ఇసుక ధరలు మరింత పెరిగాయి. ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో అధిక ధరలకు దొంగచాటున తెచ్చి విక్రయిస్తున్నారు. ప్రయాణికులను తరలించే ఆటోలో తెచ్చే ఇసుకకు రూ.2500 వసూలు చేస్తున్నారు. ఒక ఆటోలో 25 బస్తాల ఇసుక తెస్తున్నారు. ఖాళీ సిమెంట్‌ సంచుల్లో ఇసుక నింపి ఆటోల్లో రహస్యంగా తెస్తున్నారు. ఈ సంచుల్లోనూ నిండా ఉండటం లేదు. ముప్పావు శాతం మాత్రమే ఉంటోంది. సిమెంట్‌ బస్తా ధర రూ.300 ఉండగా ఇసుక ధర రూ.100 ఉంటోంది. గృహనిర్మాణ పనులు ఆగిపోయిన వారు ఇలా ఆటోల్లో ఇసుక రప్పించుకుని పనులు పూర్తి చేస్తున్నారు. ఇసుక భారంగా మారినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా దొంగచాటున కొంటున్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *